లక్ష్య సేన్ బోణీ

Lakshya Sen Shines: జపాన్‌లో జరుగుతున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ 'కుమామోటో మాస్టర్స్ జపాన్ 2025 ఈ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ అద్భుతమైన విజయం సాధించి బోణీ కొట్టాడు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్‌లో ప్రత్యర్థి జపాన్‌కు చెందిన కోకి వతానాబేపై లక్ష్యసేన్ విజయం సాధించాడు. లక్ష్యసేన్ వరుస సెట్లలో 21–12, 21–16 తేడాతో విజయం సాధించి ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌ (Round of 16)లోకి ప్రవేశించాడు.

లక్ష్యసేన్‌కు ఇది చాలా సులభమైన విజయం. 39 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో, లక్ష్యసేన్ తన మెరుగైన షాట్ సెలక్షన్, కోర్టు కవరేజీని ప్రదర్శించాడు. ఈ టోర్నమెంట్‌లో ఏడో సీడ్‌గా లక్ష్యసేన్ బరిలోకి దిగాడు.

ప్రీ-క్వార్టర్ ఫైనల్స్‌లో (Round of 16) లక్ష్యసేన్ సింగపూర్‌కు చెందిన జియా హేంగ్ జాసన్ తెహ్ తో తలపడనున్నాడు.భారత్ తరపున హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కూడా తన మొదటి రౌండ్‌లో గెలిచి ప్రీ-క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story