మరో టీమిండియా క్రికెటర్

Leg-spinner Rahul Chahar: టీమిండియా లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్, తన భార్య ఈషానీ జోహార్ నుంచి విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు.రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక భావోద్వేగపూరితమైన నోట్ షేర్ చేశారు.నేను చాలా చిన్న వయసులో (22 ఏళ్లకే) వివాహం చేసుకున్నాను. అప్పుడు నా గురించి, నా విలువ గురించి, నాకు కావాల్సిన జీవితం గురించి నాకు పూర్తి అవగాహన లేదు" అని ఆయన పేర్కొన్నారు.గత 15 నెలలుగా తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని, ఈ ప్రక్రియలో చాలా ఓర్పును, నిజాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని అలవర్చుకున్నానని చెప్పారు.ఈ రోజుతో నా జీవితంలో ఆ అధ్యాయం అధికారికంగా ముగిసింది. దీన్ని నేను కోపంతోనో, పశ్చాత్తాపంతోనో కాకుండా పూర్తి స్పష్టతతో ముగిస్తున్నాను. ఇది ఒక ముగింపు కాదు, కొత్త జీవితానికి రీసెట్ బటన్ వంటిది" అని రాహుల్ రాసుకొచ్చారు.

రాహుల్ ,ఈషానీ (వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్) చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. 2019లో వీరి నిశ్చితార్థం జరగ్గా, మార్చి 9, 2022న గోవాలో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్నారు.వీరి నాలుగో వివాహ వార్షికోత్సవానికి కేవలం కొన్ని రోజుల ముందే ఈ జంట చట్టబద్ధంగా విడిపోయారు.

రాహుల్ చాహర్ ప్రస్తుతం తన క్రికెట్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఐపీఎల్ 2026 వేలంలో ఆయనను చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రూ.5.20 కోట్లకు దక్కించుకుంది. ఇప్పుడు ఈ వ్యక్తిగత సమస్యల నుండి బయటపడి, తిరిగి ఫామ్‌లోకి రావాలని ఆయన భావిస్తున్నారు. భారత జట్టులో ఇటీవల హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్ వంటి ఆటగాళ్ల తర్వాత ఇప్పుడు రాహుల్ చాహర్ కూడా ఈ విడాకుల లిస్టులో చేరడం చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story