Legendary cricketer Dilip Vengsarkar: మ్యాచ్ విన్నర్ జైశ్వాల్ ను పక్కన పెట్డడం కరెక్ట్ కాదు
జైశ్వాల్ ను పక్కన పెట్డడం కరెక్ట్ కాదు

Legendary cricketer Dilip Vengsarkar: 2026 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఎంపికపై మాజీ సెలెక్టర్, లెజెండరీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎంపిక కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యశస్వి జైస్వాల్‌ను పదేపదే జట్టు నుంచి తప్పించడం దురదృష్టకరం. అతని తప్పేమీ లేకపోయినా అతనికి చోటు దక్కడం లేదు. జట్టులోకి రావడానికి అతను ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు" అని వెంగ్‌సర్కార్ వ్యాఖ్యానించారు.జైస్వాల్ అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, అతడిలాంటి'మ్యాచ్ విన్నర్'ను పక్కన పెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
టీ20 వరల్డ్ కప్ జట్టు నుంచి శుభ్‌మన్ గిల్ను తప్పించడాన్ని వెంగ్‌సర్కార్ సమర్థించారు. ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయడంలో సెలెక్టర్ల నిర్ణయంతో ఆయన ఏకీభవించారు.అయితే, గిల్ స్థానంలో ఎవరిని తీసుకోవాలని అడిగితే, తన మొదటి ఛాయిస్ ఖచ్చితంగా జైస్వాలే అయి ఉండేదని స్పష్టం చేశారు.
ఒక ఆటగాడు వరుసగా పరుగులు చేస్తున్నా, ఒక ఫార్మాట్‌లో అవసరం లేదని పక్కన పెడితే అతని ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని వెంగ్‌సర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రికెట్ అనేది ఆత్మవిశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని, ఇలాంటి నిర్ణయాలు యువ ఆటగాళ్ల కెరీర్‌పై ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు.

