మెస్సీ గుడ్ బై

Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత విషాదకరమైన, ఊహించని క్షణం.అర్జెంటీనా లెజెండ్, ఫుట్‌బాల్ మ్యాజీషియన్ లియోనెల్ మెస్సి అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు పూర్తిగా వీడ్కోలు పలికారు. తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించి, యావత్ క్రీడా ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు మెస్సి.
ఈ నెల ప్రారంభంలో తన తండ్రి మరణం తనను తీవ్రంగా కలచివేసిందని, ఆ వ్యక్తిగత విషాదమే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మరింత వేగవంతం చేసిందని మెస్సి వెల్లడించారు. సరిగ్గా ప్రపంచ కప్ ఫైనల్ ముగిసిన రెండు రోజుల తర్వాతే, అంటే జూలై 21నే తాను ఈ రిటైర్మెంట్ నోట్‌ను రాసుకున్నట్లు ఆయన తెలిపారు. దేశం కోసం ఆడటం తనకు ఎప్పుడూ గొప్ప గౌరవమని, కానీ ఇప్పుడు తాను ఇవ్వాల్సింది అంతా ఇచ్చేశానని, యువ ఆటగాులకు అవకాశం కల్పించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు.
నా ఇరవై ఏళ్ల ప్రయాణంలో మీరందించిన ప్రేమకు ధన్యవాదాలు. ఇకపై స్టేడియం బయటి నుంచి మీలో ఒకడిగా ఉంటూ అర్జెంటీనా జట్టును సపోర్ట్ చేస్తాను" అంటూ మెస్సి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన కుటుంబానికి, కోచ్‌లకు, తోటి ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. క్లబ్ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నప్పటికీ.. అరుదైన నీలం, తెలుపు రంగు అర్జెంటీనా జెర్సీలో ఫుట్‌బాల్ మైదానంలో మెస్సిని ఇకపై చూడలేమన్న నిరాశ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఫుట్‌బాల్ ప్రేమికులను కంటతడి పెట్టిస్తోంది.

