అది గంభీర్ కే సాధ్యం

Manoj Tiwari: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత రాజకీయ నాయకుడు మనోజ్ తివారీ ప్రస్తుతం టీమ్ ఇండియా కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గంభీర్ గతంలో చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలకు పొంతన లేదని, అందుకే ఆయనొక మంచి హిపోక్రాట్ అని ఆరోపించారు.

గతంలో గంభీర్, సరిహద్దు ఉగ్రవాదం ఆగిపోయే వరకు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడకూడదని అన్నారు. అయితే, ఇప్పుడు కోచ్‌గా ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడటానికి సమ్మతించడాన్ని తివారీ తప్పుబట్టారు. దమ్ముంటే కోచ్ పదవికి రాజీనామా చేసి కోచ్ కాక ముందు మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉండాలని సవాల్ విసిరారు. యశస్వి జైస్వాల్ భారత క్రికెట్ భవిష్యత్తు అని గంభీర్ గతంలో వ్యాఖ్యానించారు. కానీ, ప్రస్తుతం ఆసియా కప్‌లో జట్టులో జైస్వాల్‌కు చోటు దక్కకపోవడంపై తివారీ గంభీర్‌ను ప్రశ్నించారు.

ఆసియా కప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరగనుండటంపై కూడా తివారీ స్పందించారు. ఇటీవల జరిగిన భయంకరమైన పాహెల్గామ్ ఉగ్రదాడి తరువాత కూడా ఈ మ్యాచ్ జరగడం తనకు ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు. మానవ ప్రాణాల విలువ క్రీడల కంటే ఎక్కువేనని, ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడటం ద్వారా ఏం సాధిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్ తాను అస్సలు చూడనని కూడా తివారీ స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story