అందుకే సెంచరీ చేసినా పక్కన పెట్టాడు

Manoj Tiwary: టీమిండియా మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ గతంలో ఎం.ఎస్. ధోనిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2011లో వెస్టిండీస్‌పై సెంచరీ చేసినప్పటికీ, తదుపరి 14 మ్యాచ్‌లకు తనను జట్టు నుంచి ఎందుకు తప్పించారో ధోనిని అడగాలనుందని ఆయన అన్నారు. ధోని సారథ్యంలో సెలెక్షన్లు అతని ఇష్టానుసారం జరిగాయని, తాను సెంచరీ కొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచినప్పటికీ, తదుపరి సిరీస్‌లో తనకు అవకాశం ఇవ్వలేదని తివారీ తన అసంతృప్తిని వెళ్లగక్కారు.ఒకవేళ తనకు మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే, విరాట్ కోహ్లీ లేదా రోహిత్ శర్మ స్థాయికి ఎదిగి ఉండేవాడినని తివారీ అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్‌లో ధోని ఆటతీరు, అతని బ్యాటింగ్ ఆర్డర్‌పై కూడా మనోజ్ తివారీ పలు విమర్శలు చేశారు. ధోని 2023 ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత రిటైర్ అవ్వాల్సిందని, అప్పుడే అతనికి ఉన్న గౌరవం మరింత పెరిగి ఉండేదని తివారీ అన్నారు. ప్రస్తుతం అతని ఆటతీరు వల్ల ఆ గౌరవం తగ్గుతోందని వ్యాఖ్యానించారు.ధోని కింది చివరలో బ్యాటింగ్‌కు రావడాన్ని తివారీ తప్పుబట్టారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన కొన్ని మ్యాచ్‌లలో, ధోని త్వరగా బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ఫలితం వేరుగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ధోనిని బ్యాటింగ్ ఆర్డర్ మార్చమని చెప్పే ధైర్యం CSK కోచింగ్ సిబ్బందికి లేదని, తుది నిర్ణయం ధోనిదేనని తివారీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మనోజ్ తివారీ టీమిండియా తరఫున 12 వన్డేల్లో 26.09 సగటుతో ఒక సెంచరీతో సహా 287 పరుగులు చేశాడు. 3 టీ20 మ్యాచ్ ల్లో ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడి 15 పరుగులు చేశాడు. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున చివ‌రిసారి 2015లో జింబాబ్వేపై వన్డే ఆడిన తివారీ.. ఆ మ్యాచ్ లో 10 పరుగులు చేశాడు.ఐపీఎల్‌లోనూ ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్, రైసింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌ ఫ్రాంచైజీల తరుపున ఆడాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story