హాకీ జట్టు చీఫ్ కోచ్ గా మరైనె

Chief Coach of India Women’s Hockey Team: నెదర్లాండ్స్‌కు చెందిన షోర్డ్ మరైనె (Sjoerd Marijne) మళ్లీ చీఫ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం భారత హాకీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.హరేంద్ర సింగ్‌‌‌‌ స్థానంలో తను బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇది భారత మహిళల హాకీ జట్టుకు ఒక కీలక మలుపు.

గతంలో ఆయన హయాంలోనే భారత మహిళల జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానానికి చేరుకుని,చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.ఆ తర్వాత ఆయన వ్యక్తిగత కారణాలతో తప్పుకోగా,ఇప్పుడు మళ్లీ జట్టును గాడిలో పెట్టేందుకు హాకీ ఇండియా ఆయనను ఆహ్వానించింది.

భారత క్రీడాకారుల మనస్తత్వం, వారి బలాలు , బలహీనతలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆటగాళ్లలో ఫిట్‌నెస్ ,మైండ్ సెట్‌ను మార్చడంలో ఆయనది ప్రత్యేక శైలి.

రాబోయే ఆసియా క్రీడలు మరియు 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు జట్టును అర్హత సాధించేలా చేయడం ఆయన ముందున్న ప్రధాన లక్ష్యం.ప్రస్తుత జట్టులో చాలా మంది సీనియర్ ఆటగాళ్లతో ఆయనకు పాత పరిచయం ఉండటం వల్ల, జట్టుతో సమన్వయం వేగంగా కుదిరే అవకాశం ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story