Mark Wood: ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మంగళవారం (సెప్టెంబర్ 22) తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 36 ఏళ్ల మార్క్ వుడ్ 2015 నుంచి 2025 వరకు పదేళ్ల పాటు ఇంగ్లండ్ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాడు. 2019లో ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు.

మార్క్ వుడ్ చివరిసారిగా 2025-26 యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ తరఫున ఆడాడు. పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో నవంబర్ 21, 22 తేదీల్లో ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత గాయాలు, వైద్యపరమైన సమస్యల కారణంగా మైదానంలోకి తిరిగి రావడం అతడికి కష్టంగా మారింది.

తన అంతర్జాతీయ కెరీర్‌లో మార్క్ వుడ్ ఇంగ్లండ్ తరఫున 38 టెస్టులు, 70 వన్డేలు, 38 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 119 వికెట్లు, వన్డేల్లో 80 వికెట్లు, టీ20ల్లో 54 వికెట్లు పడగొట్టాడు. తన వేగంతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన వుడ్, ఇంగ్లండ్ బౌలింగ్ విభాగంలో కీలక ఆటగాడిగా గుర్తింపు పొందాడు.

వైద్యుల సలహా మేరకు టెస్టు, వన్డే క్రికెట్‌కు తిరిగి రావడం సాధ్యం కాదని తేలడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు వుడ్ తెలిపాడు. తన కాంట్రాక్ట్ ముగుస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సహజమైన విషయంగా అనిపించిందని పేర్కొన్నాడు.

తన రిటైర్మెంట్ గురించి మార్క్ వుడ్ మాట్లాడుతూ.. ‘‘నేను అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాను. గత ఏడాది జరిగిన పరిణామాలను చూస్తే ఈ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. నా కాంట్రాక్ట్ ముగుస్తున్న ఈ సమయంలో క్రికెట్‌కు వీడ్కోలు పలకడం సరైన సమయంగా అనిపిస్తోంది’’ అని తెలిపాడు.

‘‘గాయాల నుంచి కోలుకుని తిరిగి వచ్చి, నన్ను తక్కువగా అం

Next Story