Match Against India Cancelled: ఇండియాతో మ్యాచ్ బాయ్ కట్..పాక్ సంచలన ప్రకటన
పాక్ సంచలన ప్రకటన

Match Against India Cancelled: పాకిస్తాన్ ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2026న ఒక సంచలన ప్రకటన చేసింది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొంటుందని చెబుతూనే, ఫిబ్రవరి 15న భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను మాత్రం బహిష్కరిస్తున్నట్లు (Boycott) స్పష్టం చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వం తన సోషల్ మీడియా వేదికగా, "ప్రపంచకప్‌లో ఆడేందుకు మా జట్టుకు అనుమతినిస్తున్నాం, కానీ ఫిబ్రవరి 15న భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం మా జట్టు బరిలోకి దిగదు" అని వెల్లడించింది.
ఐసీసీ (ICC) భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించి, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. దీనికి నిరసనగా బంగ్లాదేశ్‌కు మద్దతు తెలుపుతూ పాకిస్తాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాక్ నిర్ణయంపై ఐసీసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలా ఒకే మ్యాచ్‌ను బహిష్కరించడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.పాకిస్తాన్ గనుక ఈ మ్యాచ్ ఆడకపోతే, నిబంధనల ప్రకారం భారత్‌కు నేరుగా 2 పాయింట్లు లభిస్తాయి.
ఇండియాతో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించిన పాక్‌పై కఠిన చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్దమవుతోంది. ఇవాళ వర్చువల్‌గా సమావేశం కానున్న ఐసీసీ బోర్డు మెంబర్స్ నిబంధనల ఉల్లంఘన కింద పాక్‌ను ఈ టోర్నీ నుంచే పూర్తిగా బహిష్కరించే అవకాశం ఉంది. అప్పుడు ఉగాండా టోర్నీలోకి వస్తుంది.

