Medvedev: మెద్వెదెవ్‌కు 42,500 డాలర్ల ఫైన్
42,500 డాలర్ల ఫైన్

Medvedev: డేనియల్ మెద్వెదేవ్ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తన ప్రవర్తనకు గాను $42,500 డాలర్ల (దాదాపు ₹37 లక్షలు) జరిమానా విధించబడింది.మెద్వెదేవ్ తన తొలి రౌండ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన బెంజమిన్ బోంజి చేతిలో ఓడిపోయారు. మూడో సెట్‌లో బోంజి మ్యాచ్ పాయింట్ వద్ద ఉండగా, ఒక ఫోటోగ్రాఫర్ కోర్టులోకి అకస్మాత్తుగా వచ్చారు. దీనితో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. అంపైర్ బోంజికి మొదటి సర్వ్ మళ్లీ వేసే అవకాశం ఇచ్చారు. దీంతో మెద్వెదేవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత, మెద్వెదేవ్ తన రాకెట్‌ను కోర్టు బెంచీపై పదేపదే కొట్టి దాన్ని ధ్వంసం చేశారు. ఈ ప్రవర్తనకు గాను అతనికి రెండు రకాల జరిమానాలు విధించారు. ఈ చర్యలు మొత్తం టోర్నమెంట్ యొక్క క్రమశిక్షణ నియమాలకు విరుద్ధం. కాగా మెద్వెదేవ్ తన ప్రవర్తనకు గాను గతంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కూడా జరిమానా ఎదుర్కొన్నాడు. టెన్నిస్ వంటి క్రీడలలో ఇలాంటి ప్రవర్తన అరుదుగా చూస్తుంటాం. ఈ సంఘటన తర్వాత, టెన్నిస్ క్రీడాకారుల మానసిక ఆరోగ్యం మరియు ప్రవర్తనపై చర్చ మొదలైంది. అభిమానులు, ప్రేక్షకులు ఎంత రెచ్చగొట్టినా ఓర్పుతో ఉండాలని టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకెర్ సూచించాడు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉందని రష్యా సహచరుడు ఆండ్రే రుబ్లెవ్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది మెద్వెదెవ్‌కు ఏమీ కలిసిరాలేదు. ప్రతి ‘ఓపెన్’లోనూ చుక్కెదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండో రౌండ్‌లో.. ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్‌లో తొలి రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు బోంజి చేతిలో యూఎస్ ఓపెన్ మొదటిరౌండ్‌లోనే పరాజయం చవిచూశాడు.
