పాక్ మాజీ పేసర్‌కు కైఫ్ అదిరిపోయే లెఫ్ట్ అండ్ రైట్!

Mohammad Kaif: మొహమ్మద్ అమీర్‌పై మహమ్మద్ కైఫ్ నిప్పులు చెరిగారు. భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుందని అమీర్‌కు ముందే తెలుసని, కేవలం వార్తల్లో నిలవడానికే అతను ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని కైఫ్ మండిపడ్డారు. టీమిండియా వెస్టిండీస్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుందని అమీర్ అప్పట్లో జోస్యం చెప్పారు. అది నిజం కాకపోవడంతో, మళ్లీ మాట మార్చి ఇంగ్లాండ్ జట్టు భారత్‌ను అడ్డుకుంటుందని, సూర్యకుమార్ యాదవ్ సేన ఫైనల్ చేరదని వ్యాఖ్యానించారు.

వీటితో పాటు భారత ఓపెనర్ అభిషేక్ శర్మను 'స్లాగర్' (కేవలం బంతిని బలంగా బాదేవాడు) అని అమీర్ విమర్శించడం భారత అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీనిపై తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించిన కైఫ్, అమీర్ స్థాయికి దిగజారి సమాధానం చెప్పాల్సిన అవసరం భారతీయులకు లేదని స్పష్టం చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న భారత్ సెమీస్‌కు వెళ్తుందనే విషయం అమీర్‌కు తెలియదా? అని కైఫ్ ప్రశ్నించారు. కేవలం అటెన్షన్ కోసమే ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

పాకిస్థాన్ జట్టు పతనాన్ని గుర్తు చేస్తూ కైఫ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా వంటి చిన్న జట్టు చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడానికి అమీర్ వేసిన సూపర్ ఓవరే కారణమని కైఫ్ గుర్తు చేశారు. ఆ ఓవర్‌లో ఒక్క బౌండరీ మాత్రమే వచ్చినా, వరుసగా వైడ్లు వేసి జట్టును ఓడించిన బౌలర్ ఇతరుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అసలు పటిష్టమైన కెప్టెన్, సరైన బౌలర్లు లేక వెనుకబడిపోయిన దేశం గురించి మనం ఎందుకు పట్టించుకోవాలని కైఫ్ ఘాటుగా విమర్శించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story