Mirabai Chanu: భారత క్రీడా చరిత్రలో మరో అద్భుత అధ్యాయం నమోదైంది. గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ తన పసిడి ఖాతాను విజయవంతంగా తెరిచింది. దేశం గర్వించదగ్గ వెయిట్‌లిఫ్టింగ్ స్టార్ మీరాబాయి చాను అంచనాలకు తగ్గట్టుగానే రాణించి, దేశానికి మొట్టమొదటి స్వర్ణ పతకాన్ని అందించింది.

మహిళల 48 కేజీల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి చాను ఆరంభం నుంచే తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. స్నాచ్ విభాగంలో అద్భుతంగా రాణించిన ఆమె, 85 కేజీల బరువును ఎత్తి సరికొత్త కామన్వెల్త్ , గేమ్స్ రికార్డును తన పేరున లిఖించేచేసుకుంది.అనంతరం క్లీన్ అండ్ జర్క్ విభాగంలోనూ అదే జోరును కొనసాగించి 105 కేజీల బరువును విజయవంతంగా ఎత్తింది. మొత్తంగా 190 కేజీల బరువును ఎత్తి టోర్నమెంట్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో మీరాబాయి చానుకి ఇది వరుసగా మూడో బంగారు పతకం కావడం విశేషం. గతంలో 2018 (గోల్డ్‌కోస్ట్), 2022 (బర్మింగ్‌హామ్) క్రీడల్లోనూ స్వర్తాలు సాధించిన ఆమె, ఇప్పుడు గ్లాస్గో-2026లోనూ పసిడి మోత మోగించి హ్యాట్రిక్ సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడు స్వర్ణ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా వెయిట్‌లిఫ్టర్‌గా ఆమె అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించింది.

కఠినమైన సాధన, పట్టుదలతో మరోసారి తన సత్తా ఏంటో చాటిన మీరాబాయి చాను.. భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని అందించి కోట్లాది మంది భారతీయుల తల ఎగిరేలా చేసింది. దేశం తరఫున ఆమె సాధించిన ఈ చారిత్రాత్మక విజయం పట్ల క్రీడా ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story