Mitchell Starc: టీ20లకు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా స్టార్ బౌలర్
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్

Mitchell Starc: ఆస్ట్రేలియా వెటరన్ బౌలర్ మిచెల్ స్టార్క్ టీ20లకు గుడ్ బై చెప్పాడు. టీ20 లనుంచి తప్పకుంటున్నానని..ఇకపై వన్డేలు, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతానని తన సోషల్ మీడియాలో ప్రకటించాడు. వన్డే, టెస్ట్ క్రికెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు.
మిచెల్ స్టార్క్ 2012లో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. స్టార్క్ టీ20 ఫార్మాట్‌లో 2012 నుంచి 2024 వరకు 65 మ్యాచ్‌లలో 79 వికెట్లు తీశారు. అతని బెస్ట్ బౌలింగ్ గణాంకాలు 20 పరుగులకు 4 వికెట్లు. అతని ఎకానమీ రేటు 7.74గా ఉంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో ఆస్ట్రేలియా జట్టులో స్టార్క్ కీలక పాత్ర పోషించారు. 2021 టీ20 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో అతను ఒక ముఖ్య సభ్యుడు. తన స్వింగ్, వేగంతో బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెడుతూ, ముఖ్యమైన మ్యాచ్‌లలో కీలక వికెట్లు తీశారు.స్టార్క్ లెఫ్ట్ -ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. అతని ప్రత్యేకత అతని వేగం, స్వింగ్ ,యార్కర్లు. ముఖ్యంగా, అతను డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడంలో దిట్ట.
