Mithali Raj: ఆ రెండు జట్లే వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్తయ్
వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్తయ్

Mithali Raj: సెప్టెంబర్ 30 నుంచి జరగనున్న ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ పై మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మహిళల ODI ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతాయని మిథాలీ రాజ్ అంచనా వేశారు. ఆస్ట్రేలియా జట్టు ఇంకా అత్యంత కఠినమైన ప్రత్యర్థిగా అని చెప్పారు. స్వదేశంలో ప్రపంచ కప్ ఆడడం భారత జట్టుకు ఒక మంచి అవకాశం అని మిథాలీ అభిప్రాయపడ్డారు. ఈ టోర్నమెంట్ ను గెలిస్తే భారత మహిళా క్రికెట్ కు ఒక కొత్త దిశ వస్తుందని ఆమె అన్నారు.
పెద్ద మ్యాచ్ ల్లో చిన్న చిన్న క్షణాలను గెలుచుకోవడం చాలా ముఖ్యం అని మిథాలీ అన్నారు. గొప్ప జట్లు ఈ విషయంలో బాగా రాణిస్తాయని, భారత్ కూడా అలా చేయాలని ఆమె సూచించారు. హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు, క్రాంతి గౌడ్ వంటి యువ ప్రతిభావంతులు కూడా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తారని మిథాలీ చెప్పారు. యువ ఆటగాళ్లు ఆత్మవిశ్వాసంతో, భయం లేకుండా ఆడాలని ఆమె ఆకాంక్షించారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) వల్ల యువ క్రీడాకారులకు వృత్తిపరమైన మార్గం లభించిందని, ఫ్రాంచైజీలు వారిపై పెట్టుబడి పెడుతున్నాయని మిథాలీ అన్నారు. ఇది భారత మహిళా క్రికెట్ ఎదుగుదలకు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆమె అభివర్ణించారు.
