పుజారాపై మోదీ ప్రశంసలు

Modi Praises Pujara: క్రికెట్ కు గుడ్ బై చెప్పిన చతేశ్వర్ పుజారా భారత క్రికెట్‌కు అందించిన సేవలకు గాను ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో పుజారా నిలకడైన ఆటతీరు, దృఢసంకల్పం, క్రీడాస్ఫూర్తిని ప్రధాని అభినందించారు. కఠిన పరిస్థితుల్లోనూ పుజారా ప్రదర్శించిన కఠోర దీక్షను, నిబద్ధతను మోదీ కొనియాడారు.భారత టెస్ట్ క్రికెట్ జట్టుకు పుజారా అందించిన సేవలను, తన ఆటతో జట్టును ఆదుకున్న తీరును ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పొట్టి ఫార్మాట్‌కు ఆధిపత్యం ఉన్న ఈ కాలంలో, పుజారా టెస్ట్ క్రికెట్ గొప్పదనాన్ని గుర్తు చేశారు మోదీ. ఆయన సంకల్పం, నిబద్ధత , నిలకడ గురించి ప్రశంసించారు. పుజారా ఆటగాళ్లకే కాకుండా, యువతరానికి కూడా ఒక గొప్ప స్ఫూర్తి అని మోదీ అన్నారు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా బ్యాటింగ్, ముఖ్యంగా బ్రిస్బేన్ టెస్టులో అతను ఎదుర్కొన్న గాయాలు, బాధలు, వాటిని తట్టుకుని జట్టు విజయం కోసం చేసిన పోరాటాన్ని మోదీ గుర్తు చేసుకున్నారు. క్రికెట్‌లో యువతకు పుజారా ఒక గొప్ప స్ఫూర్తి అని, అతని ఆటతీరు అద్భుతంగా ఉందని ప్రశంసించారు. మోదీ లేఖకు స్పందించిన పుజరా .. నేను నా రెండో ఇన్నింగ్స్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు నాకు లభించిన ఇలాంటి ప్రేమ, ప్రశంసలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు సర్." అని అన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో భారత జట్టుకు వెన్నెముకగా నిలిచారు పుజారా. 103 టెస్టుల్లో 43.60 సగటుతో 7,195 పరుగులు సాధించారు. ఇందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story