Mohammad Kaif: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్. ఫామ్‌లో ఉన్న సంజు శాంసన్‌ను తుది జట్టు నుంచి తప్పించి, యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టాడు. అభిషేక్ శర్మతో కలిసి వైభవ్‌ను ఓపెనర్‌గా పంపడం ద్వారా భారత్ మరోసారి వ్యూహాత్మక తప్పిదం చేస్తోందని కైఫ్ హెచ్చరించాడు."

"టీ20 వరల్డ్ కప్‌లో చేసిన తప్పునే భారత్ ఇంగ్లాండ్ టూర్‌లో మళ్లీ రిపీట్ చేస్తోందని కైఫ్ గుర్తుచేశాడు. వరల్డ్ కప్ ఆరంభంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లను ఓపెనర్లుగా పంపారని.. కానీ ప్రత్యర్థి జట్టు ఆఫ్ స్పిన్నర్లను ప్రయోగించగానే వారు తలవంచక తప్పలేదని అన్నాడు. సౌతాఫ్రికా చేతిలో భారీ ఓటమి చవిచూసేంత వరకు శాంసన్‌కు అప్పట్లో అవకాశం ఇవ్వలేదని.. కానీ సంజు టీమ్‌లోకి వచ్చాక రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్‌తో ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని కైఫ్ విశ్లేషించాడు."

"అభిషేక్, వైభవ్ సూర్యవంశీ ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లే కావడం వల్ల వీరు దీర్ఘకాలం ఓపెనర్లుగా సక్సెస్ కాలేరని కైఫ్ స్పష్టం చేశాడు. శాంసన్ ఒకటి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనా.. అతడు సవాళ్లను ఎదుర్కొని ఒంటిచేత్తో భారీ శతకాలు బాదగల సమర్థుడన్నాడు. ఇప్పటికైనా టీమ్ మేనేజ్‌మెంట్ కళ్లు తెరిచి శాంసన్‌ను ఓపెనర్‌గా పంపాలని.. అభిషేక్ లేదా వైభవ్‌లలో ఒకరిని మూడో స్థానంలో ఆడించడం తప్ప మరో మార్గం లేదంటూ కైఫ్ ఇచ్చిన సలహా ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది."

Updated On
PolitEnt Media

PolitEnt Media

Next Story