నన్నెందుకు తీసుకోవట్లేదు.?

Mohammed Shami: టీమిండియా స్టార్ పేసర్ షమీ ప్రస్తుతం గాయాల నుంచి కోలుకుని టీమిండియాకు ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల ఆసియా కప్ కు షమీ ఎంపిక కాలేదు. దీంతో షమీ సెలక్టర్లపై అసంతృప్తిగా ఉన్నాడు. ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన షమీ.. సెలక్టర్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తాను బ్రాంకో టెస్టు కూడా పాసయ్యానన్న షమీ..తనను ఎందుకు తీసుకోవడం లేదో తెలియదన్నారు. తనకు ఒక్క చాన్స్ ఇస్తే బెస్ట్ ఇస్తానని చెప్పాడు.

తనను జట్టు నుంచి తప్పించడంపై సెలక్టర్లపై ఎలాంటి ఆగ్రహం లేదని షమీ స్పష్టం చేశాడు. సెలక్టర్లపై నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ప్లేయర్స్ ఫామ్‌లో ఉండటం, ఫిట్‌గా ఉండటం. సెలక్టర్లకు ఏ ఆటగాడిని తీసుకోవాలో బాగా తెలుసు. ఒక ప్లేయర్‌ను జట్టులోంచి తీసేస్తే, ఆ స్థానంలో మరో ఆటగాడు వస్తాడు. ఇది సాధారణ విషయం అని షమీ అన్నాడు

జట్టు నుంచి తనను తొలగించినప్పుడు ఎలాంటి కారణాలు చెప్పలేదని అడిగిన ప్రశ్నకు, షమీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. "సెలక్టర్ల పని వాళ్ళు చేస్తున్నారు. ఏ ప్లేయర్ సరిగ్గా లేకున్నా వాళ్లకు తెలుస్తుంది. వాళ్లు నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి నేను ఆ విషయం గురించి ఆలోచించను" అని తెలిపాడు. తనను జట్టు నుంచి తొలగించినా, తిరిగి జట్టులో చేర్చినా తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. నేను ఆడటానికి సిద్ధంగా ఉన్నా...ఒక్క చాన్స్ ఇస్తే బెస్ట్ ఇస్తా. సెలక్టర్ల నిర్ణయాలను తాను గౌరవిస్తా అని షమీ తేల్చిచెప్పాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story