ఆలోచన లేదు

Mohammed Shami: టెస్టు క్రికెట్ నుంచి పలువురు సీనియర్లు రోహిత్,కోహ్లీ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై లేటెస్ట్ గా స్పందించారు.

గాయం కారణంగా కొంతకాలంగా క్రికెట్ నుంచి దూరంగా ఉన్న మహమ్మద్ షమీ “ప్రస్తుతం నేను నా గాయం నుంచి పూర్తిగా కోలుకుంటున్నాను. నా ఫిట్‌నెస్ పై దృష్టి పెట్టాను. త్వరలోనే మైదానంలోకి తిరిగి రావాలని ఆశిస్తున్నాను” అని అన్నాడు.

క్రికెట్ నుంచి రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు, “నేను ఇంకా క్రికెట్ ఆడగలనని భావిస్తున్నాను. నా శరీరం సహకరించినంత కాలం ఆడతాను. రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు” అని స్పష్టం చేశారు.నేను చాలా ఒత్తిడిని ఎదుర్కొన్నాను. కానీ నేను నా కుటుంబం , స్నేహితుల మద్దతుతో దానిని అధిగమించగలిగాను. క్రికెట్ నాకు చాలా ధైర్యాన్నిచ్చింది. అదే నాకు ఒక రకమైన ఊరటనిచ్చిందని చెప్పారు.

రెండేళ్ల కిందట చివరిసారిగా టెస్టు మ్యాచ్‌ ఆడిన షమీ.. అప్పటినుంచి జట్టులో స్థానం దక్కించుకోలేదు. ఈ ఏడాది న్యూజిలాండ్‌తో వన్డే, ఇంగ్లాండ్‌పై టీ20 మ్యాచ్ ఆడిన షమీ గాయంతో దూరమయ్యాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story