అవార్డు రేసులో సిరాజ్

Mohammed Siraj: ఐసీసీ ఆగస్టు 2025 ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఇందులో భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్ నుంచి ఒక్కొక్కరిని నామినేట్ చేసింది. ముగ్గురు బౌలర్లే కావడం విశేషం. టీమిండియా నుంచి మన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ నామినేట్ అయ్యారు. ఈ అవార్డుకు విజేతలను ఓటింగ్ అకాడమీ , అభిమానుల ఓట్ల ఆధారంగా త్వరలో ప్రకటిస్తారు.

పురుషుల విభాగంలో:

మొహమ్మద్ సిరాజ్ (భారత్): ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసి మ్యాచ్ గెలిపించినందుకు సిరాజ్ ఈ నామినేషన్‌కు అర్హత సాధించాడు.

మాట్ హెన్రీ (న్యూజిలాండ్): జింబాబ్వేతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసినందుకు నామినేట్ అయ్యాడు.

జేడెన్ సీల్స్ (వెస్టిండీస్): పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుతంగా రాణించి, వెస్టిండీస్ జట్టు 34 సంవత్సరాల తర్వాత సిరీస్‌ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించినందుకు నామినేట్ అయ్యాడు.

మహిళల విభాగంలో:

మునీబా అలీ (పాకిస్తాన్): ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీ సాధించినందుకు నామినేట్ అయింది.

ఓర్లా ప్రెండర్‌గస్ట్ (ఐర్లాండ్): పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌లో ఆమె ఆల్-రౌండ్ ప్రదర్శనకు గాను నామినేట్ అయింది.

ఇరిస్ జ్విల్లింగ్ (నెదర్లాండ్స్): టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్‌లో ఆమె అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసినందుకు నామినేట్ అయింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story