Mumbai Indians: 2027 సీజన్‌పై ముంబయి ఇండియన్స్ ఫోకస్.. కొత్త కెప్టెన్ రేసులో ఎవరున్నారు?
కొత్త కెప్టెన్ రేసులో ఎవరున్నారు?

Mumbai Indians: హార్దిక్ పాండ్య నిష్క్రమణతో 2027 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ను నడిపించేదెవరనే ప్రశ్న మొదలైంది. సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్‌లతో పాటు యువ ఆటగాడు తిలక్ వర్మ కూడా మంచి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. అయితే 36 ఏళ్ల సూర్యకుమార్ మూడేళ్లుగా సరైన ఫామ్‌లో లేకపోవడంతో కెరీర్ చరమాంకంలో ఉన్న అతనికి ఇప్పుడు సారథ్య బాధ్యతలు అప్పగించకపోవచ్చు.
తరచూ ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడే బుమ్రాకు కూడా కెప్టెన్సీ ఇవ్వడం మీద ముంబయి సానుకూలంగా లేకపోవచ్చు. భవిష్యత్ దృష్టితో తిలక్ వర్మే సరైన ఎంపిక అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత సీజన్‌లో ఘోర వైఫల్యం, జట్టు మరియు కోచింగ్ బృందంలో అనేక మార్పులు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు తిలక్‌ను కెప్టెన్‌గా చేస్తే అతనిపై ఒత్తిడి ఎక్కువ ఉంటుందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఒక్క సీజన్‌కు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించి, అతని సారథ్యంలో తిలక్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి.
కానీ రోహిత్ దీనికి అంగీకరిస్తాడా అనేది ప్రశ్న. రోహిత్ సరే అంటే ఒక సీజన్‌కు తాత్కాలికంగా అతన్ని కెప్టెన్‌గా చేసి, తర్వాతి ఏడాది తిలక్‌ను కెప్టెన్‌గా చేయొచ్చు. లేదంటే ఈసారే తిలక్ బాధ్యతలు అందుకున్నా ఆశ్చర్యం లేదు.

