WPL Action Begins Today: ముంబై వర్సెస్ బెంగళూరు..ఇవాళ్టి నుంచి WPL
ఇవాళ్టి నుంచి WPL

WPL Action Begins Today: ఈ రోజు నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నవీ ముంబైలో మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు ముందు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభ వేడుకలు జరుగుతాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ , జియో సినిమా లేదా జియోస్టార్ యాప్‌లో ఉచితంగా చూడవచ్చు.ఇటీవల భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత జరుగుతున్న మొదటి లీగ్ ఇది.
2023, 2025లో టైటిల్ నెగ్గిన హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని ముంబై జట్టు పేపర్ మీద చాలా బలంగా కనిపిస్తోంది. సివర్ బ్రంట్ (ఇంగ్లండ్), హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్) రాకతో జట్టు బ్యాటింగ్ బలోపేతం అయ్యింది.ఈసారి కొన్ని మార్పులతో బెంగళూరు కూడా లీగ్‌కు రెడీ అయ్యింది. అయితే బ్యాటింగ్ భారం మొత్తం కెప్టెన్ స్మృతి మంధానాపైనే పడనుంది. ఎలైస్ పెర్రీ ఈ సీజన్ నుంచి తప్పుకోవడం వాళ్లకు మైనస్‌గా మారింది. మంధానాతో కలిసి జార్జియా వోల్ ఓపెనింగ్ చేసే చాన్స్ ఉంది. హేమలత, గౌతమీలో ఒకరు మూడో ప్లేస్‌లో బ్యాటింగ్‌కు రావొచ్చు.అరుంధతి రెడ్డి, లారెన్ బెల్, రాధా యాదవ్, పూజా వస్త్రాకర్, సయాలీ సట్గరే కూడా మెరిస్తే బెంగళూరు బౌలింగ్ కష్టాలు తీరినట్లే.

