Rohit Sharma:టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తే మా నాన్న బాధపడ్డాడు
మా నాన్న బాధపడ్డాడు

Rohit Sharma:ఇటీవల టెస్టు ఫార్మాట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే పూజారా భార్య రాసిన బుక్ ఓపెనింగ్ లో రోహిత్ తన రిటైర్మెంట్ గురించి తొలిసారి స్పందించాడు. టెస్టులకు రిటైర్మెంట్ ఇవ్వడం తన నాన్నకు నచ్చలేదని చెప్పాడు.
తాను ఈ స్థాయికి రావడానికి తల్లిదండ్రుల త్యాగాలే కారణమని, వారి సపోర్ట్ లేనిదే ఇదంతా సాధ్యమయ్యేది కాదని రోహిత్ చెప్పాడు. టెస్టు క్రికెట్‌ను ఎంతగానో ఇష్టపడే తన తండ్రి కోసమే ఆ ఫార్మాట్ ఆడాలనుకున్నానని వెల్లడించాడు. ఇంగ్లండ్ టూర్‌కు ముందు టెస్టు క్రికెట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ఇచ్చిన రోహిత్ ఆ నిర్ణయం గురించి తొలిసారి మాట్లాడాడు. ‘మా నాన్న మొదటి నుంచి టెస్ట్ క్రికెట్‌కు వీరాభిమాని. ఆయనకు ఈ కొత్త తరం టీ20 క్రికెట్ పెద్దగా నచ్చదు. నేను వన్డేలో 264 స్కోరు చేసినప్పుడు కూడా ఆయన సరే, బాగా ఆడావులే అని మాత్రమే అన్నారు. కానీ నేను టెస్టుల్లో 30, 40 రన్స్ చేసినా కూడా దాని గురించి ఎంతో వివరంగా మాట్లాడేవారు. అలాంటి నాన్న నేను టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు సహజంగానే కొంచెం నిరాశ చెందారు. కానీ, చివరికి నా నిర్ణయాన్ని అర్థం చేసుకుని సంతోషించారు’ అని రోహిత్ అన్నాడు.
