WAPL వేలం

WAPL: తెలుగు రాష్ట్రాల్లో మహిళా క్రికెట్‌కు మహర్దశ రాబోతోంది. మహిళా క్రికెటర్లలోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ఒక అద్భుతమైన టోర్నమెంట్‌కు తెరలేపింది. అదే 'విమెన్ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (WAPL).ఈ చారిత్రాత్మక టోర్నమెంట్‌కు భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ లెజెండరీ కెప్టెన్, రికార్డుల రారాజు మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. మిథాలీ రాజ్ మార్గదర్శకత్వంలో ఈ లీగ్ యువగళానికి పెద్ద పీఠ వేయనుంది.
మొత్తం నాలుగు జట్లు తలపడనున్న ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 15 నుండి 26 వరకు వైభవంగా జరగనుంది. ఈ టోర్నమెంట్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లకు మంగళగిరిలోని అత్యాధునిక స్టేడియం వేదిక కానుంది.
ఈ టోర్నీలో పాల్గొనే క్రీడాకారిణుల ఎంపిక కోసం ఇవాళ విజయవాడ వేదికగా ప్లేయర్స్ వేలం (ఆక్షన్) నిర్వహించనున్నారు. ఈ వేలంలో మొత్తం 191 మంది క్రీడాకారిణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రతి జట్టు ఫ్రాంచైజీ తమ జట్టును పటిష్టం చేసుకోవడానికి గరిష్ఠంగా 15 లక్షల రూపాయల పర్స్ వాల్యూను వెచ్చించనుంది.
ఈ లీగ్ కోసం ప్రముఖ కంపెనీలు ఫ్రాంచైజీలను దక్కించుకున్నాయి.ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఏకంగా రూ. 89 లక్షలు బిడ్ వేసి టోర్నీలోనే అత్యధిక ధరతో 'సెంట్రల్ ఆంధ్రా' ఫ్రాంచైజీని దక్కించుకోగా, ఆ జట్టుకు అమరావతి ఈ ఛాంపియన్స్' అని పేరు పెట్టారు.అలాగే గ్యారిసన్ కన్స్ట్రక్షన్స్ రూ. 85.59 లక్షలతో 'రాయలసీమ జెన్ స్టార్స్' జట్టును సొంతం చేసుకుంది.ఓరా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 77.77 లక్షలకు 'వైజాగ్ ఫైర్ బర్డ్స్' జట్టును దక్కించుకోగా...ఎన్ఎస్ఆర్ ఇండస్ట్రీస్ రూ. 61.11 లక్షలకు 'గోదావరి గోల్డెన్ ఈగిల్స్' ఫ్రాంచైజీని దక్కించుకున్నాయి.
ఫ్రాంచైజీల కొనుగోళ్లతో ఇప్పటికే భారీ హైప్ తెచ్చుకున్న WAPL... తెలుగు నేల నుంచి అంతర్జాతీయ స్థాయి మహిళా క్రికెటర్లను తయారు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సెప్టెంబర్ 15 నుంచి మంగళగిరిలో జరగబోయే ఈ క్రికెట్ సమరం కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

