స్టాప్ క్లాక్ అంటే ఏంటి.?

New Rules in Test Cricket: టెస్టు క్రికెట్ లో ఐసీసీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.స్టాప్ క్లాక్ రూల్.. డీఆర్ఎస్ విధానంపై మార్పులు చేస్తూ కీలక రూల్స్ ప్రకటించింది. ఈ రూల్స్ మూడు ఫార్మాట్ లకు వర్తిస్తాయి.

స్లో ఓవర్ రేట్ ను తగ్గించేందుకు కొత్తగా ఈ ఫార్మాట్ లో స్టాప్ క్లాక్ ను ప్రవేశపెట్టింది. షార్ట్ రన్ తీస్తే ఏ బ్యాటర్ సైక్లో ఉండాలో నిర్ణయించుకోవడానికి ఫీల్డింగ్ జట్లకు అనుమతి ఇచ్చింది. 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టుతోనే ఇవి అమల్లోకి వచ్చాయి.

ఫీల్డింగ్ జట్టు మునుపటి ఓవర్ పూర్తయిన 60 సెకన్లలోపు తర్వాతి ఓవర్ను ప్రారంభించాలి. ఇందుకోసం సున్నా నుంచి 60 సెకన్ల వరకు లెక్కించే ఎలక్ట్రానిక్ క్లాక్ గ్రౌండ్లో ప్రదర్శించబడుతుంది. ఈ క్రమంలో ఫీల్డింగ్ జట్టుకు రెండు హెచ్చరికలు జారీ చేస్తారు. మూడోసారి ఉల్లం ఘన జరిగితే బ్యాటింగ్ జట్టుకు ఐదు రన్స్ పెనాల్టీగా ఇవ్వబడతాయి. 80 ఓవర్లు పూర్తి అయిన తర్వాత ఈ హెచ్చరికలు సున్నాకు రీసెట్ అవుతాయి' అని ఐసీసీ వెల్లడించింది. స్టాప్ క్లాక్ రూల్ ఇప్పటికే వన్డే, టీ20ల్లో అమలు చేస్తున్నారు.

ఇతర కీలక నిబంధనలు మార్పులు

స్టాప్ క్లాక్'తో పాటు ఐసీసీ మరికొన్ని నియమాలను కూడా మార్చింది. DRS ప్రోటోకాల్‌లను మెరుగుపరిచారు. టెస్టుల్లో ఓవర్-రేట్ జరిమానాలకు కొత్త రూపు ఇచ్చారు.

మరొక ముఖ్యమైన మార్పు ఏమిటంటే బంతిపై లాలాజలం ఉన్నట్లు తేలితే అంపైర్లు బంతిని వెంటనే మార్చాల్సిన అవసరం లేదు. బంతి పరిస్థితి తీవ్రంగా మారితేనే (ఉదాహరణకు అది బాగా తడిగా లేదా మెరిసేలా కనిపిస్తే) అంపైర్లు బంతిని మారుస్తారు.

ఒక కొత్త జరిమానాను ప్రవేశపెట్టారు. ఒక బ్యాటర్ ఉద్దేశపూర్వకంగా ప్రయోజనం పొందడానికి షార్ట్ రన్ తీసినట్లు తేలితే, ఏ బ్యాటర్‌ను స్ట్రైక్‌లో ఉంచాలనుకుంటున్నారో ఫీల్డింగ్ జట్టును అంపైర్లు అడుగుతారు. అదనంగా, బ్యాటింగ్ జట్టుకు ఐదు పరుగులు తగ్గిస్తారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story