Pakistan Head Coach: హ్యాండ్‌షేక్ ఇవ్వకపోవడం నిరాశ కలిగించింది: పాకిస్తాన్ హెడ్ కోచ్
నిరాశ కలిగించింది: పాకిస్తాన్ హెడ్ కోచ్

Pakistan Head Coach: ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం (హ్యాండ్‌షేక్) చేయకుండా డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. ఈ విషయంపై పాకిస్తాన్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.."మ్యాచ్ తర్వాత కరచాలనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే, మా ప్రత్యర్థి (భారత్) అలా చేయకపోవడం నిరాశ కలిగించింది. మేము కరచాలనం చేయడానికి వెళ్ళేసరికి, వారు ఇప్పటికే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయారు. మ్యాచ్ ముగిసిన తీరు ఇది చాలా నిరాశగా ఉంది" అని అన్నారు. ఈ సంఘటన తరువాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా పోస్ట్-మ్యాచ్ ప్రజెంటేషన్ వేడుకకు కూడా హాజరు కాలేదు. దీనిపై మైక్ హెస్సన్ మాట్లాడుతూ, కెప్టెన్ నిర్ణయం కరచాలనం చేయకపోవడం వల్లే తీసుకున్నారని తెలిపారు.ఈ విషయంలో భారత జట్టు ప్రభుత్వ, క్రికెట్ బోర్డు నిర్ణయాలకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. దీనికి ముందు, భారత్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మైక్ హెస్సన్, తమ జట్టులోని బౌలింగ్ విభాగం బలంగా ఉందని, ముఖ్యంగా ప్రపంచంలోనే ఉత్తమ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్ తమ జట్టులో ఉన్నారని పేర్కొన్నారు. పాకిస్తాన్ జట్టు భారత్‌తో పోరుకు సిద్ధంగా ఉందని కూడా ఆయన చెప్పారు.
