మరొకటి లేదు: స్మృతి మంధాన

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలపై పరోక్షంగా స్పందిస్తూ, తనకు క్రికెట్ కంటే మించింది ప్రపంచంలో మరొకటి లేదని స్పష్టం చేశారు. భారత జట్టుకు తొలిసారిగా ఆడిన 12 సంవత్సరాల ప్రయాణంలో తాను ఈ సత్యాన్ని గ్రహించానని ఆమె పేర్కొన్నారు. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో వివాహాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు వచ్చిన తర్వాత, ఆమె బుధవారం అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో తొలిసారిగా బహిరంగంగా పాల్గొన్నారు.ఆ ఇండియన్ జెర్సీని ధరించడమే మమ్మల్ని నడిపించే ప్రేరణ అని తెలిపారు. చిన్నప్పటి నుంచే తనకు బ్యాటింగ్ అంటే పిచ్చి ఉండేదని, అప్పుడే తన మనసులో 'ప్రపంచ ఛాంపియన్' అని పిలవబడాలనే స్పష్టమైన లక్ష్యం ఉండేదని ఆమె గుర్తు చేసుకున్నారు.

భారత జట్టు ఇటీవల సాధించిన ప్రపంచ కప్ విజయం గురించి మంధాన భావోద్వేగంతో మాట్లాడారు. “ఈ ప్రపంచ కప్ మేము సంవత్సరాలుగా చేసిన సుదీర్ఘ పోరాటానికి లభించిన బహుమతి. మేము దాని కోసం తీవ్రంగా ఎదురుచూశాం. నేను 12 ఏళ్లకు పైగా ఆడుతున్నాను – చాలాసార్లు పరిస్థితులు మాకు అనుకూలించలేదు. ఫైనల్‌కు ముందు మేము దానిని ఊహించుకున్నాము, చివరికి స్క్రీన్‌పై చూసినప్పుడు, మాకు గూస్‌బంప్స్ వచ్చాయి. అది అద్భుతమైన, ప్రత్యేకమైన క్షణం,” అని వివరించారు.

ఫైనల్‌కు దిగ్గజ క్రీడాకారిణులు మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి హాజరుకావడం తమ భావోద్వేగాన్ని మరింత పెంచిందని మంధాన తెలిపారు. “వారి కోసం మేము ఈ విజయాన్ని సాధించాలని బలంగా అనుకున్నాం. వారి కళ్లలో నీళ్లు చూసినప్పుడు, మహిళా క్రికెట్ మొత్తంగా గెలిచినట్లు అనిపించింది. వారందరి తరపున గెలిచిన యుద్ధం అది” అని ఆమె పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story