రోకో జోడీ ప్రాక్టీస్

ODI Battle Begins Tomorrow: రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ ఇండియా సీనియర్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో వీరిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారు. నెట్స్‌లో రోహిత్, కోహ్లీ దాదాపు ఒకటిన్నర గంటల పాటు నెట్స్‌లో గడిపారు. భారత పేసర్లు, స్పిన్నర్లతో పాటు త్రో-డౌన్ స్పెషలిస్టులను ఎదుర్కొంటూ తమ బ్యాటింగ్‌ను మెరుగుపరుచుకున్నారు.ప్రాక్టీస్ సమయంలో విరాట్ కోహ్లీ చాలా సరదాగా కనిపించాడు. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను విరాట్ అనుకరించిన తీరు సహచర ఆటగాళ్లతో పాటు రోహిత్ శర్మను కూడా నవ్వుల్లో ముంచెత్తింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, రోహిత్ శర్మ చాలా ఫిట్‌గా కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ కంటే రోహిత్ 'సన్నగా' కనిపిస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన వీరిద్దరూ మంచి టచ్‌లో ఉన్నారు. కోహ్లీ ఢిల్లీ తరపున 131, 77 పరుగులతో రాణించగా, రోహిత్ కూడా ఆస్ట్రేలియా పర్యటనలో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు.

న్యూజిలాండ్ వన్డే సిరస్ కు శుభ్‌మన్ గిల్ టీమ్ ఇండియాకు నాయకత్వం వహిస్తుండగా, రోహిత్, విరాట్ కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story