.రోహిత్ ,కోహ్లీకి నో చాన్స్

ODI Series Against South Africa: దక్షిణాఫ్రికా 'ఎ' తో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే (లిస్ట్-ఎ) సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఇండియా 'ఎ' జట్టును ప్రకటించింది. భారత 'ఎ' జట్టుకు యువ ఆటగాడు తిలక్ వర్మ నాయకత్వం వహించనున్నాడు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరమయ్యాడు. రంజీ ట్రోఫీలో రాణించిన ఇషాన్ కిషన్‎కు జట్టులో స్థానం దక్కింది. యంగ్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఎంపికయ్యారు.సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ ఈ ఇండియా 'ఎ' జట్టులో లేరు. నవంబర్ 13 నుంచి 19 వరకు రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో దక్షిణాఫ్రికా, భారత 'ఎ' జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్ జరగనుంది.

దక్షిణాఫ్రికా ఎ సిరీస్ కోసం ఇండియా ఎ జట్టు

తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వికెట్ కీపర్ ), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, విప్రజ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్)

PolitEnt Media

PolitEnt Media

Next Story