తొలి వికెట్ కోల్పోయిన ఇండియా

ODI World Cup: మహిళల ప్రపంచకప్ 2025లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత మహిళల జట్టు తమ మొదటి వికెట్‌ను స్మృతి మంధాన రూపంలో కోల్పోయింది. శ్రీలంక బౌలర్ అచిని కులసూర్య బౌలింగ్‌లో స్మృతి మంధాన 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయింది. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో భారత మహిళల జట్టు బ్యాటింగ్‌కు దిగింది.ప్రస్తుతం ఇండియా స్కోరు 9 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. క్రీజులో ప్రతీకా రావల్ 18,హర్లీన్ డియోల్ 14 ఉన్నారు.

ఇండియా జట్టు

ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (c), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (WK), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, స్నేహ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి

శ్రీలంక జట్టు

చమరి అథాపత్తు (సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, కవిషా దిల్హరి, నీలాక్షి డి సిల్వా, అనుష్క సంజీవని (Wk), అచ్చిని కులసూర్య, సుగండిక కుమారి, ఉదేశిక ప్రబోధని, ఇనోకా రణవీర

PolitEnt Media

PolitEnt Media

Next Story