భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన

Indian Star Cricketer Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన 2025 సంవత్సరంలో ఒక అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్నారు. 2025 క్యాలెండర్ ఇయర్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) ప్రపంచంలోనే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలవడానికి ఆమెకు ఇంకా కేవలం 62 పరుగుల దూరంలో ఉన్నారు

ప్రస్తుతం టీమిండియా పురుషుల జట్టు ఆటగాడు శుభ్‌మన్ గిల్ 1,764 పరుగులతో (టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి) అగ్రస్థానంలో ఉన్నారు. స్మృతి మంధాన ఇప్పటికే దాదాపు 1,703 పరుగులు పూర్తి చేశారు.ఇవాళ శ్రీలంకతో జరగనున్న 5వ టీ20 మ్యాచ్‌లో ఆమె ఈ 62 పరుగులు సాధిస్తే, పురుషుల రికార్డును కూడా అధిగమించి 2025లో 'వరల్డ్ టాపర్'గా నిలుస్తారు.ఆమె ఇప్పటికే ఈ ఏడాది (2025)లో మహిళల క్రికెట్ చరిత్రలో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ప్రపంచ రికార్డు సృష్టించారు.

శ్రీలంకతో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్లలో కలిపి) 10,000 పరుగులు పూర్తి చేసిన రెండవ భారతీయ మహిళా క్రికెటర్‌గా (మిథాలీ రాజ్ తర్వాత) రికార్డు సృష్టించారు.

2025లో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్ విజేతగా నిలవడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఒకే క్యాలెండర్ ఇయర్‌లో వన్డేల్లో 1000 పరుగులు దాటిన మొదటి మహిళా క్రికెటర్‌గా కూడా ఆమె నిలిచారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story