PV Sindhu: భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పి.వి. సింధు ఇటీవల జపాన్ ఓపెన్ చరిత్రాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుని తనలో ఛాంపియన్ ఆట ఇంకా తగ్గలేదని నిరూపించింది! వరుస గాయాలు, ప్రతి టోర్నీలోనూ తొలి రౌండ్లలోనే నిష్క్రమణలు.. 2028 ఒలింపిక్స్ వరకు సింధు కొనసాగుతుందా అని సందేహించిన వారికి తన ఆటతోనే సమాధానమిచ్చింది. అయితే, ఈ మైండ్ బ్లోయింగ్ కమ్‌బ్యాక్ వెనుక టీమిండియా స్టార్ రన్ మెషీన్ విరాట్ కోహ్లి ఇచ్చిన సలహా ఉందన్న విషయం మీకు తెలుసా?

కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు తానెంతో ఒత్తిడికి గురయ్యానని సింధు తెలిపింది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సమయంలో, తన బాధను అర్థం చేసుకునే ఒక వ్యక్తి మార్గదర్శకత్వం అవసరమైంది. అలాంటి కష్ట సమయంలో తాను కోహ్లిని సంప్రదించగా.. నిమిషాల వ్యవధిలోనే స్పందించిన విరాట్, మరుసటి రోజే సింధును కలిశారట!

నేను విరాట్ భాయ్‌కి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా కష్టకాలంలో ఆయన స్పందించిన తీరు, ఇచ్చిన సలహాలు నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. ఆయన చెప్పిన మాటలు నాకు, నా భర్త దత్తాకూ బాగా గుర్తుండిపోయాయి. కొన్ని సంభాషణలు మన ఆలోచనా తీరునే పూర్తిగా మార్చేస్తాయి.. కోహ్లితో జరిగిన ఆ మాటలే నా ఆలోచనను మార్చింది" అని సింధు భావోద్వేగంగా వెల్లడించింది.

ఆటలో మళ్లీ కిక్ ఇచ్చేలా..

సొంత ఫామ్‌ను కోల్పోయి, సెంచరీ కోసం సుదీర్ఘకాలం ఎదురుచూసిన సమయంలో తనకు ఎదురైన అనుభవాలను, మైండ్‌సెట్‌ను కోహ్లి సింధుతో పంచుకున్నారు. టైటిళ్ల వెంట పడకుండా, ఆటను ఆస్వాదించడమే ముఖ్యమని కోహ్లి ఇచ్చిన ఉచిత సలహా సింధులో కొత్త ఊపిరి నూరింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story