తప్పుకున్న ఓపెనర్ ప్రతీక రావల్

Opener Pratik Rawal Withdraws from World Cup: భారత క్రికెట్ వుమెన్స్ జట్టుకు ఎదురుదెబ్బ. భారత ఓపెనర్, ప్రతీక రావల్, గాయం కారణంగా ప్రపంచ కప్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఆమె కుడి చీలమండకు (Right Ankle) గాయమైంది. మ్యాచ్ తర్వాత 25 ఏళ్ల ఈ యువ ఓపెనర్ కు స్కానింగ్ తీయగా ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం.

ఈ టోర్నమెంట్‌లో ప్రతీక అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు .6 ఇన్నింగ్స్‌లలో 308 పరుగులు చేశారు. కాబట్టి ఆమె సెమీ-ఫైనల్‌కు దూరం కావడం భారత జట్టుకు పెద్ద లోటు. ప్రతీక రావల్ స్థానంలో, షెఫాలీ వర్మను భారత జట్టులోకి తీసుకున్నారు. ఐసీసీ (ICC) ఈ మార్పును ఆమోదించింది.

షెఫాలీ వర్మ తన పవర్-హిట్టింగ్‌తో ఇన్నింగ్స్ ఆరంభంలోనే దూకుడుగా ఆడగల సామర్థ్యం ఉన్నందున, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో సెమీ-ఫైనల్‌కు ముందు ఆమె రాక జట్టుకు సానుకూలంగా భావించవచ్చు.

భారత జట్టు తన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను అక్టోబర్ 30న (గురువారం) ఆస్ట్రేలియాతో నవీ ముంబై వేదికగా ఆడనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story