Pakistan’s New ODI Captain: పాకిస్తాన్ వన్డే కెప్టెన్‌గా పేసర్ షాహీన్ అఫ్రిది నియామకం
కెప్టెన్‌గా పేసర్ షాహీన్ అఫ్రిది నియామకం

Pakistan’s New ODI Captain: పాకిస్తాన్ క్రికెట్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదిని వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టుకు కొత్త కెప్టెన్‌గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) నియమించింది. ఇంతకు ముందు ఈ బాధ్యతలను నిర్వహించిన వికెట్ కీపర్-బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ స్థానంలో షాహీన్ అఫ్రిదిని నియమిస్తూ పీసీబీ సోమవారం (అక్టోబర్ 20, 2025) అధికారిక ప్రకటన విడుదల చేసింది. షాహీన్ అఫ్రిది కెప్టెన్‌గా తొలిసారి నవంబర్ 4 నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ జట్టును నడిపించనున్నాడు. గతంలో మొహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలో పాకిస్తాన్ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో నిరాశపరిచిన నేపథ్యంలో, ఆయనపై వేటు పడటం ఖాయమైంది. రిజ్వాన్ కేవలం ఒక సంవత్సరం మాత్రమే వన్డే కెప్టెన్‌గా కొనసాగారు. జాతీయ సెలక్షన్ కమిటీ, వైట్‌బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్‌తో ఇస్లామాబాద్‌లో జరిగిన కీలక సమావేశం తర్వాత ఈ కెప్టెన్సీ మార్పు నిర్ణయాన్ని పీసీబీ తీసుకుంది. పాకిస్తాన్ క్రికెట్‌లో తరచూ జరుగుతున్న కెప్టెన్సీ మార్పుల పరంపరలో భాగంగా, దూకుడుగా బౌలింగ్ వేసే షాహీన్ అఫ్రిదికి వన్డే కెప్టెన్సీ పగ్గాలు అప్పగించడం చర్చనీయాంశమైంది. టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు సల్మాన్ అలీ ఆగా కెప్టెన్‌లుగా ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు మూడు ఫార్మాట్‌లకు ముగ్గురు కెప్టెన్లు అయినట్లయింది.
