పాకిస్తాన్ జట్టు ఇదే..

Squad for World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఏడుగురు యువ క్రీడాకారిణులు తొలిసారి ప్రపంచ కప్‌లో ఆడనున్నారు. ఈ జట్టుకు ఫాతిమా సనా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. గత ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్‌లో పాకిస్థాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసి ప్రపంచ కప్ లోకి అడుగుపెట్టింది.ఈ జట్టులో యువ బ్యాటర్ ఈమాన్ ఫాతిమా స్థానం సంపాదించుకోవడం విశేషం. ఆమె ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. పాకిస్థాన్ తమ తొలి ప్రపంచ కప్ మ్యాచ్‌ను అక్టోబర్ 2న బంగ్లాదేశ్‌తో ఆడనుంది, ఆ తర్వాత అక్టోబర్ 5న భారత్‌తో తలపడనుంది.

పాకిస్థాన్ ప్రపంచ కప్ జట్టు

ఫాతిమా సనా (కెప్టెన్)

మునీబా అలీ సిద్దిఖీ (వైస్ కెప్టెన్)

అలియా రియాజ్

డైయానా బైగ్

ఈమాన్ ఫాతిమా

నష్రా సంధు

నటాలియా పర్వైజ్

ఒమైమా సొహైల్

రమీన్ షమీమ్

సదాఫ్ షమాస్

సాదియా ఇక్బాల్

షావాల్ జుల్ఫికర్

సిద్రా అమీన్

సిద్రా నవాజ్ (వికెట్ కీపర్)

సయ్యదా ఆరూబ్ షా

రిజర్వ్ ప్లేయర్స్:

గుల్ ఫిరోజా

నజీహా అల్వీ

తూబా హసన్

ఉమ్-ఎ-హాని

వాహిదా అఖ్తర్

PolitEnt Media

PolitEnt Media

Next Story