షోయబ్ మాలిక్ విడాకులు!

Shoaib Malik: సానియా మీర్జా మాజీ భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తన మూడో భార్య, నటి సనా జావేద్‌కు కూడా విడాకులు ఇవ్వబోతున్నారనే ప్రచారం పాకిస్తాన్ మీడియాలో జోరుగా సాగుతోంది. జనవరి 2024లో పాకిస్తానీ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్న షోయబ్ మాలిక్, పెళ్లైన కొద్ది నెలల్లోనే ఆమెతో విడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఒక బహిరంగ కార్యక్రమంలో షోయబ్, సనా జావేద్‌లు ఒకరికొకరు దూరంగా కూర్చోవడం, మాట్లాడకపోవడం, సనా కోపంగా కనిపించడం వంటి దృశ్యాలున్న వీడియో వైరల్ అయింది. వారిద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నట్లు కూడా సమాచారం. అయితే, ఈ విడాకుల వార్తలపై షోయబ్ మాలిక్ గానీ, సనా జావేద్ గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. షోయబ్ మాలిక్‌కు ఇది మూడో వివాహం. అంతకుముందు ఆయన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. 14 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2024 మొదట్లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సనా జావేద్‌కు కూడా ఇది రెండో వివాహం. కాగా 2007 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన 43 ఏళ్ల మాలిక్, ఇప్పటివరకు పురుషుల తరఫున మొత్తం 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story