బోణీ కొట్టిన పాకిస్తాన్

Asia Cup2025: దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ఒమన్‌పై 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టులో మొహమ్మద్ హారిస్ 43 బంతుల్లో 66 పరుగులతో అద్భుతంగా రాణించాడు. అతనికి సహకరిస్తూ సాహిబ్జాదా ఫర్హాన్ 29 పరుగులు చేశాడు.

అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఒమన్ జట్టు పాక్ బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయింది. కేవలం 16.4 ఓవర్లలో 67 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఒమన్ తరఫున హమ్మద్ మీర్జా 27 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో సైమ్ అయూబ్, సూఫియాన్ ముకీమ్ మరియు ఫహీమ్ అష్రఫ్ తలా రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

మొహమ్మద్ హారిస్ తన మెరుపు ఇన్నింగ్స్‌కు గానూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ విజయం పాకిస్తాన్ జట్టుకు టోర్నమెంట్‌లో మంచి శుభారంభాన్ని ఇచ్చింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story