రిటైర్మెంట్ ఇచ్చిన పాక్ పవర్ హిట్టర్

Pakistani cricketer Asif Ali: పాకిస్థాన్ క్రికెటర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 33 ఏళ్ల ఆసిఫ్ అలీ సోషల్ మీడియా ద్వారా ఈ నిర్ణయాన్ని తెలియజేశాడు. పాకిస్తాన్ జెర్సీ ధరించడం తన జీవితంలో అతిపెద్ద గౌరవం అని, దేశానికి సేవ చేయడం గర్వంగా ఉందన్నాడు. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ఆసిఫ్ అలీ, ఇటీవల ప్రకటించిన ఆసియా కప్‌లో చోటు దక్కించుకోలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

అయితే, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, అతను ప్రపంచవ్యాప్తంగా వివిధ ఫ్రాంచైజీ లీగ్‌లు, దేశవాళీ క్రికెట్‌లో ఆడటం కొనసాగిస్తానని తెలిపాడు.

మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, ముఖ్యంగా హిట్టర్ గా పేరు పొందాడు. 2018లో టీ20, వన్డేలలో అరంగేట్రం చేశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 7 బంతుల్లో 25 పరుగులు చేసి పాకిస్థాన్‌కు విజయం సాధించిపెట్టడం అతని కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది. చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2023లో ఆడిండు.

21 వన్డే మ్యాచ్‌లలో 25.46 సగటుతో 382 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.58 టీ20 మ్యాచ్‌లలో 15.18 సగటు, 133.87 స్ట్రైక్ రేట్‌తో 577 పరుగులు చేశాడు.

PolitEnt Media

PolitEnt Media

Next Story