ఇవాళ్టి నుంచి ముస్తాక్ అలీ ట్రోఫీ బరిలోకి

Pandya Returns: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. అతను తిరిగి మైదానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు.గత ఆసియా కప్ 2025లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాండ్యాకు ఎడమ తొడ కండరాలకు గాయం అయింది. ఈ గాయం కారణంగా అతను ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు, దక్షిణాఫ్రికాతో జరిగిన ODI సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. అతను బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో దాదాపు ఆరు వారాల పాటు శిక్షణ పొందాడు. కోలుకున్న తర్వాత, పాండ్యా "రిటర్న్ టు ప్లే" క్లియరెన్స్‌ను పొందాడు. అంటే, అతను ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్ సహా పూర్తి మ్యాచ్ వర్క్‌లోడ్‌ను తట్టుకోగలడని బీసీసీఐ ధృవీకరించింది.

అతను నేరుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకుండా, ఫిట్‌నెస్, మ్యాచ్ ప్రాక్టీస్ కోసం దేశవాళీ క్రికెట్‌లో ఆడనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరపున ఆడనున్నాడు. ఇవాళ పంజాబ్‌తో, డిసెంబర్ 4న గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లలో అతను ఆడే అవకాశం ఉంది.ఈ డొమెస్టిక్ మ్యాచ్‌లలో అతని ఫిట్‌నెస్ , బౌలింగ్ సామర్థ్యాన్ని సెలెక్టర్లు దగ్గరగా పర్యవేక్షించనున్నారు.

దేశవాళీ క్రికెట్‌లో ఫిట్‌నెస్ నిరూపించుకున్న తర్వాత, డిసెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో జరిగే T20 అంతర్జాతీయ సిరీస్‌లో అతను భారత జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది.పాండ్యా తిరిగి జట్టులోకి రావడం టీ20 ప్రపంచ కప్ 2026కు ముందు భారత జట్టుకు చాలా పెద్ద బూస్ట్ అవుతుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story