ఇషాన్ కిషన్‌కు పిలుపు?

Pant Dropped: న్యూజీలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టులో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. తాజా సమాచారం ప్రకారం, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ జట్టులో చోటు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫామ్, జట్టు సమతుల్యతను దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వన్డేల్లో సరైన ఫామ్‌లో లేని రిషబ్ పంత్‌ను పక్కనపెట్టి, దేశీవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్న ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నారు. పంత్ చివరగా ఆగస్టు 2024లో శ్రీలంకపై వన్డే ఆడారు. ఇటీవల దక్షిణాఫ్రికా సిరీస్‌లో జట్టులో ఉన్నప్పటికీ, తుది జట్టులో అవకాశం దక్కలేదు. మరోవైపు, ఇషాన్ కిషన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేయడమే కాకుండా, విజయ్ హజారే ట్రోఫీలో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించారు. మెడ గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్, ఇప్పుడు పూర్తిగా కోలుకుని జట్టు పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గిల్ రాకతో టాప్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది. అయితే, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ పొందుతున్నారు.

న్యూజీలాండ్‌తో జరగనున్న ఈ మూడు వన్డేల సిరీస్ జనవరి 11 నుంచి 18 వరకు జరగనుంది

మొదటి వన్డే జనవరి 11, 2026

రెండో వన్డే జనవరి 14, 2026

మూడో వన్డే జనవరి 18, 2026

PolitEnt Media

PolitEnt Media

Next Story