పంత్ అదిరే రికార్డులు

Rishabh Pant: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లోనూ దుమ్మురేపాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన పంత్, రాహుల్ తో కలిసి కీల‌క‌ ఇన్నింగ్స్ ఆడాడు. 83 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత, పంత్ గేర్ మార్చి మిగిలిన 50 పరుగులు కేవలం 47 బంతుల్లోనే చేసి తన టెస్ట్ కెరీర్ లో 8వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పంత్ తన సెంచరీ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 2 అద్భుతమైన సిక్సర్లు బాదాడు.

రిషబ్ పంత్ చారిత్రాత్మక ఇన్నింగ్స్

లీడ్స్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 100 పరుగుల మార్కును చేరుకోవడం ద్వారా టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా పంత్ నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ లో, రిషబ్ పంత్ కేవలం 130 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇది పంత్ కు 8వ సెంచరీ, తొలి ఇన్నింగ్స్‌లో 146 బంతుల్లో ఈ ఘనత సాధించాడు. విశేషమేమిటంటే.. ఈ 8 సెంచరీలలో 6 సెంచరీలు పంత్ విదేశీ గడ్డపై సాధించాడు.

ఇది ఇంగ్లాండ్‌పై పంత్ చేసిన 5వ సెంచరీ కావ‌డం గ‌మ‌నార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంగ్లాండ్‌పై పంత్ చేసిన 5 సెంచరీలలో 4 సెంచరీలు ఇంగ్లాండ్ గడ్డపైనే చేశాడు. దీంతో, విదేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జాబితాలో పంత్ మూడవ స్థానంలో నిలిచాడు. అయితే సెంచరీ సాధించిన తర్వాత పంత్ ఎక్కువసేపు క్రీజులో నిల‌బ‌డ‌లేడు. తన ఇన్నింగ్స్‌లో 140 బంతులు ఎదుర్కొన్న పంత్, 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 118 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ప్రపంచంలో రెండవ వికెట్ కీపర్

ఈ సెంచరీ ఇన్నింగ్స్‌తో, రిషబ్ పంత్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. టెస్ట్‌లలో రెండు సెంచరీలు చేసి.. ప్రపంచంలో రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయ్యాడు. పంత్ కంటే ముందు.. ఆండీ ఫ్లవర్ 2001లో దక్షిణాఫ్రికాపై రెండు ఇన్నింగ్స్‌లలో 100 పరుగులు చేయడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు చేసిన 5వ భారత బ్యాట్స్‌మన్‌గా కూడా పంత్ గుర్తింపు పొందాడు.

టెస్ట్ మ్యాచ్‌లో 5 సెంచరీలు

లీడ్స్ టెస్ట్‌లో టీమ్ ఇండియా ఇప్పటివరకు 5 సెంచరీలు చేసింది. పంత్ రెండు సెంచరీలతో పాటు, యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, KL రాహుల్ కూడా సెంచరీలు సాధించారు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమ్ ఇండియా ఒక టెస్ట్ మ్యాచ్‌లో 5 సెంచరీలు చేయడం ఇదే తొలిసారి.

PolitEnt Media

PolitEnt Media

Next Story