గిల్ పై రవిశాస్త్రి పశంసలు

Ravi Shastri : టీమిండియా టెస్ట్ కెప్టెన్ గిల్ పై టీమ్ ఇండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ .. డాన్ బ్రాడ్‌మన్‌లా బ్యాటింగ్ చేశారని కొనియాడారు. రెండో టెస్టులో గిల్ కెప్టెన్సీకి 10కి 10 మార్కులిస్తానన్నాడు. విదేశాల్లో ఒక భారత కెప్టెన్ చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదేనని ప్రశంసించాడు. ఆకాశ్‌ లాంటి సీమర్‌ను తీసుకున్న అతని నిర్ణయాన్ని మెచ్చుకోవాలని..అక్కడి పరిస్థితులకు ఆకాశ్ సరైన ఎంపిక. అతను సిరీస్ మొత్తం ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడని చెప్పాడు రవిశాస్త్రి

లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 147 పరుగులు చేసిన గిల్.. జూలై 6 ఇంగ్లాండ్ తో ఎడ్జ్ బాస్టన్ లో రెండో టెస్టులో 30 ఫోర్లు, 3 సిక్సర్లతో 269 పరుగుల మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. ఇక రెండో ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసి ఔరా అనిపించిన గిల్.. ఓవరాల్ గా తొలి రెండు టెస్టుల్లో 585 పరుగులు చేయడం విశేషం. దీంతో గిల్ పై క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story