పృథ్విషా,రుతురాజ్

Maharashtra Squad: పృథ్వీ షా,రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ ప్రస్తుతం బుచ్చిబాబు ఇన్విటేషనల్ టోర్నమెంట్‌లో మహారాష్ట్ర తరపున ఆడనున్నారు. పృథ్వీ షా ముంబై జట్టు నుంచి మహారాష్ట్రకు మారాడు. గత సీజన్‌లో ఫిట్‌నెస్, క్రమశిక్షణ లోపం వంటి కారణాల వల్ల ముంబై రంజీ జట్టు నుంచి పృథ్వీ షా దూరమయ్యాడు. దీని తర్వాత, అతను ముంబై క్రికెట్ అసోసియేషన్ నుంచి ఎన్.ఓ.సి. (No Objection Certificate) తీసుకొని మహారాష్ట్ర జట్టులో చేరాడు. ఇది అతని కెరీర్‌కు ఒక కొత్త ప్రారంభం అని చెప్పొచ్చు.

రుతురాజ్ గైక్వాడ్ మొదటి నుంచి మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను ప్రస్తుతం భారత జట్టులో, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున నిలకడగా రాణిస్తున్నాడు. ఈ ఇద్దరు ప్రతిభావంతులైన ఓపెనర్లు ఒకే జట్టులో ఉండడం మహారాష్ట్రకు చాలా బలం చేకూరుస్తుంది. రుతురాజ్ గైక్వాడ్ మొదటి మ్యాచ్ తర్వాత దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్ జోన్ జట్టులో చేరాల్సి ఉంది. ఈ ఇద్దరి భాగస్వామ్యం, మహారాష్ట్ర జట్టుకు దేశవాళీ క్రికెట్‌లో చాలా కీలకం కానుంది.

మహారాష్ట్ర టీం

అంకిత్ బావ్నే (కెప్టెన్),రుతురాజ్ గైక్వాడ్ పృథ్వీ షా, సిద్ధేష్ వీర్, సచిన్ ధాస్, అర్షిన్ కులకర్ణి, హర్షల్ కేట్,సిద్ధార్థ్ మాత్రే,సౌరభ్ నవాలే (వికెట్ కీపర్),మందార్ భండారి (వికెట్ కీపర్),రామకృష్ణ ఘోష్,ముఖేష్ చౌదరి,ప్రదీప్ ధాదే, విక్కీ ఓస్త్వాల్,హితేష్ వాళుంజ్,ప్రశాంత్ సోలంకి,రాజవర్ధన్ హంగర్గేకర్

PolitEnt Media

PolitEnt Media

Next Story