ఏ జట్టులో ప్రియాంశ్, వైభవ్

Priyansh and Vaibhav: నవంబర్‌ 14 నుంచి 23 వరకు ఖతార్‌లో జరుగనున్న రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌-2025 కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన ఇండియా-ఏ జట్టును ప్రకటించింది. జితేశ్‌ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తారు. పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్‌ ధిర్‌ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

యువ సంచలనాలకు చోటు

ఐపీఎల్‌లో మెరిసిన ప్రియాంశ్‌ ఆర్య, కేవలం 14 ఏళ్లకే దేశీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ ఓపెనర్లుగా ఆడతారు.

మిడిలార్డర్‌లో నేహల్‌ వధేరా, సూర్యాంశ్‌ షేడ్గే, రమన్‌దీప్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ వంటి యువ బ్యాటర్లు ఉన్నారు. స్పిన్నర్లుగా సుయాశ్‌ శర్మ, హర్ష్‌ దూబే, పేసర్లుగా గుర్జప్నీత్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌, విజయ్‌ కుమార్‌ వైశాక్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌ ఎంపికయ్యారు.

గ్రూప్‌లో పాకిస్థాన్-ఏ

ఈ టోర్నీలో భారత-ఏ జట్టు గ్రూప్‌-బిలో ఉంది. ఈ గ్రూప్‌లో ఒమన్‌, యూఏఈ, పాకిస్తాన్‌-ఏ జట్లు ఉన్నాయి.

భారత-ఏ జట్టు

ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ, రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌, అభిషేక్‌ పోరెల్ (వికెట్ కీపర్), సుయాష్ శర్మ.

PolitEnt Media

PolitEnt Media

Next Story