Pro Kabaddi League: ప్రో కబడ్డీ లీగ్ (PKL) 12వ సీజన్ ఆగస్టు 29 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే తెలుగు టైటాన్స్ జట్టు తలపడనుంది. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఆగస్టు 29న విశాఖపట్నంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో మొదలవుతుంది. తొలి రోజు మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు తమిళ తలైవాస్‌తో పోటీపడుతుంది.

ఏడేళ్ల విరామం తర్వాత ప్రో కబడ్డీ విశాఖపట్నం తిరిగి వస్తోంది. ఇది తెలుగు టైటాన్స్ అభిమానులకు గుడ్ న్యూస్ గా చెప్పవచ్చు. తెలుగు టైటాన్స్ జట్టులో పవన్ కుమార్ షెరావత్, విజయ్ మాలిక్, సంజీవి ఎస్, మంజీత్ శర్మ వంటి ముఖ్య ఆటగాళ్లు ఉన్నారు.

గత సీజన్లో తెలుగు టైటాన్స్ అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. 22 మ్యాచ్‌లలో కేవలం 2 విజయాలు మాత్రమే నమోదు చేసి చివరి స్థానంలో నిలిచింది. రాబోయే సీజన్‌లో తెలుగు టైటాన్స్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story