Japan Open: జపాన్ ఓపెన్ ..ఇంటి దారి పట్టిన పీవీ సింధు
ఇంటి దారి పట్టిన పీవీ సింధు

Japan Open: జపాన్ ఓపెన్ 2025 టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యూ జిన్ తో జరిగిన మహిళల సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు 15-21, 14-21 తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమితో తొలి రౌండ్‌లోనే ఓడిపోవడం ఈ సంవత్సరం ఐదవసారి . గాయం తర్వాత తిరిగి ఫామ్‌లోకి రావడానికి సింధు ప్రయత్నిస్తున్నారు. ఈ ఓటమి పారిస్ ఒలింపిక్స్‌లో పీవీ సింధుకు పతకం గెలవాలన్న ఆశలకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
పీవీ సింధు రెండు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ మహిళ. సింధు తన కెరీర్ లో 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకున్నారు. పీవీ సింధు చివరిసారిగా 2022లో సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు బంగారు పతకాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించారు.
పీవీ సింధు 2013లో అర్జున అవార్డు,2015లో పద్మశ్రీ, 2016లో ఖేల్ రత్న,,2020లో పద్మ భూషణ్ పురస్కరాలు అందుకున్నారు.
