క్వార్టర్స్‌లోకి పీవీ సింధు, సాత్విక్‌-చిరాగ్‌

China Masters: చైనా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి తమ జోరు కొనసాగిస్తూ క్వార్టర్‌ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్‌లో వీరు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. మహిళల సింగిల్స్‌లో మాజీ ప్రపంచ ఛాంపియన్ సింధు, ఆరో సీడ్ పోర్న్‌పావీ చోచువాంగ్‌పై సునాయాసంగా విజయం సాధించింది. 41 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు 21-15, 21-15 తేడాతో ప్రత్యర్థిని ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

సాత్విక్‌-చిరాగ్‌ల సత్తా..

పురుషుల డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ కూడా తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. సియాంగ్ చ్యూ-వాంగ్ లిన్ జంటతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 32 నిమిషాల్లోనే 21-13, 21-12 తేడాతో విజయం సాధించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఈ విజయాలతో భారత బ్యాడ్మింటన్ అభిమానుల ఆశలు మరింత పెరిగాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story