Ranji Trophy Final: రంజీ ఫైనల్ సమరం.. టాస్ గెలిచిన జమ్మూకశ్మీర్
టాస్ గెలిచిన జమ్మూకశ్మీర్

Ranji Trophy Final: భారత దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన రంజీ ట్రోఫీ ఫైనల్ సమరం మొదలైంది. హుబ్బళ్లిలోని KSCA రాజనగర్ స్టేడియంలో కర్ణాటక, జమ్మూ & కాశ్మీర్ జట్లు టైటిల్ పోరులో తలపడుతున్నాయి.ఈ కీలక మ్యాచ్‌లో జమ్మూ & కాశ్మీర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 8 ఓవర్లు ముగిసే సరికి జమ్మూకశ్మీర్ 14 పరుగులు చేసింది.
కర్ణాటకకు 8 సార్లు ఛాంపియన్ చేరిన అనుభవం ఉంది 9వ టైటిల్ పై కన్నేసింది. ఇక జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది.67 ఏళ్ల తర్వాత జమ్మూ & కాశ్మీర్ జట్టు మొదటిసారి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్‌లో బెంగాల్‌పై అద్భుత విజయం సాధించి ఇక్కడికి వచ్చారు.11 ఏళ్ల విరామం తర్వాత కర్ణాటక మళ్ళీ ఫైనల్ ఆడుతోంది. టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఉండటం ఆ జట్టుకు పెద్ద బలం. జమ్మూ & కాశ్మీర్ తన మొదటి టైటిల్‌ను గెలిచి చరిత్ర సృష్టిస్తుందా లేక కర్ణాటక తన 9వ ట్రోఫీని ముద్దాడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
జట్లు:
జమ్మూ కాశ్మీర్ (ప్లేయింగ్ XI): కమ్రాన్ ఇక్బాల్, యావెర్ హసన్, శుభమ్ పుండిర్, పరాస్ డోగ్రా(C), అబ్దుల్ సమద్, కన్హయ్య వధావన్(w), అబిద్ ముస్తాక్, ఔకిబ్ నబీ దార్, యుధ్వీర్ సింగ్ చరక్, సాహిల్ లోత్రా, సునీల్ కుమార్
కర్ణాటక (ప్లేయింగ్ XI): కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, దేవదత్ పడిక్కల్(C), కరుణ్ నాయర్, స్మరణ్ రవిచంద్రన్, శ్రేయాస్ గోపాల్, కృతిక్ కృష్ణ(w), విద్యాధర్ పాటిల్, విజయ్‌కుమార్ వైషాక్, శిఖర్ శెట్టి, ప్రసిద్ధ్ కృష్ణ

