రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు

Ravi Shastri Makes Sensational Comments: భారత టెస్ట్ క్రికెట్‌లో క్షీణిస్తున్న ప్రమాణాలపై టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను వెనుకేసుకు వచ్చేది లేదని స్పష్టం చేస్తూనే, జట్టు వరుస వైఫల్యాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో ఇలాంటి పతనం జరిగి ఉంటే పూర్తి బాధ్యత తానే తీసుకునేవాడినని శాస్త్రి పేర్కొన్నారు.

టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో వైట్‌వాష్‌కు గురైన నేపథ్యంలో, గంభీర్ కోచింగ్ శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో రవి శాస్త్రి మాట్లాడుతూ... "మీరు నన్ను అడగండి. గువాహటిలో ఏం జరిగింది? 100/1 నుంచి 130/7కు ఎలా పడిపోయారు? ఈ జట్టు అంత బలహీనంగా ఏమీ లేదు. వారికి తగినంత ప్రతిభ ఉంది. కాబట్టి, బాధ్యత ఆటగాళ్లు కూడా తీసుకోవాలి" అని అన్నారు.

ఈ సందర్భంగా, "మీరు గౌతమ్ గంభీర్‌ను ప్రొటెక్ట్ (వెనుకేసుకు) చేస్తున్నారా?" అన్న ప్రశ్నకు శాస్త్రి స్పందిస్తూ, "అసలు కాదు. వంద శాతం అతనికీ (గంభీర్‌కు) బాధ్యత ఉంది. నేను వేరే మాట ఎప్పుడు అన్నాను? అగర్ యహ్ మేరే సాథ్ హోతా, మెయిన్ పెహ్లా రెస్పాన్సిబిలిటీ లేతా (ఒకవేళ ఇది నా కోచింగ్ సమయంలో జరిగి ఉంటే, నేనే తొలి బాధ్యత తీసుకునేవాడిని)" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, డ్రెస్సింగ్‌ రూమ్‌ మీటింగ్‌లో మాత్రం ఆటగాళ్లను వదిలిపెట్టేవాడిని కాదని ఆయన తేల్చి చెప్పారు.

a

2017 నుంచి 2021 వరకు రవి శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్‌లో అద్భుతమైన విజయాలు సాధించింది. ఆయన హయాంలో భారత్ విదేశాల్లో (ముఖ్యంగా ఆస్ట్రేలియాలో) రెండు చారిత్రక టెస్ట్ సిరీస్‌లు గెలిచి, 42 నెలల పాటు నెంబర్ 1 టెస్ట్ జట్టుగా నిలిచింది.

అయితే, రాహుల్ ద్రవిడ్ తర్వాత గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి, స్వదేశంలో కూడా న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్ల చేతిలో వైట్‌వాష్‌లను ఎదుర్కోవడంతో భారత టెస్ట్ ప్రదర్శనపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ వైఫల్యాలకు గంభీర్ కోచింగ్ శైలి, జట్టు ఎంపిక కారణమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story