Ravichandran Ashwin: పంత్ ఓపెనర్ గానే రావాలి: అశ్విన్
అశ్విన్

Ravichandran Ashwin: లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాటింగ్ పొజిషన్‌పై టీమ్ ఇండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా పంత్ విఫలమైనప్పటికీ.. అదే స్థానంలో కొనసాగాలని అశ్విన్ గట్టిగా సూచిస్తున్నారు.
"పంత్ తన బ్యాటింగ్ పొజిషన్‌ను మార్చుకోకూడదు. ఒక మ్యాచ్‌లో ఫెయిల్ అయినంత మాత్రాన వెనక్కి తగ్గవద్దు. పంత్ పవర్ ప్లే తర్వాత క్రీజులోకి వస్తే, బౌలర్లు అతడిని ఈజీగా కట్టడి చేసే అవకాశం ఉంటుంది. అదే ఓపెనర్‌గా వస్తే మైదానం నలుమూలలా షాట్లు ఆడే స్వేచ్ఛ దొరుకుతుంది. అందుకే సీజన్‌లోని మొత్తం 14 మ్యాచ్‌ల్లోనూ పంత్ ఓపెనర్‌గానే రావాలి."
లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ మరియు మేనేజ్‌మెంట్ సభ్యులు పంత్‌తో ఈ విషయంపై చర్చించాలని అశ్విన్ కోరారు. పంత్‌కు కావాల్సిన నమ్మకాన్ని ఇచ్చి, తన సహజ సిద్ధమైన ఆటను స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.మరి అశ్విన్ ఇచ్చిన ఈ సలహాను ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్ పాటిస్తుందో లేదో.. రాబోయే మ్యాచ్‌ల్లో పంత్ మళ్ళీ ఓపెనర్‌గా వచ్చి మెరుపులు మెరిపిస్తాడో లేదో వేచి చూడాలి.

