Ravichandran Ashwin Predicts: మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2026 రిటైర్మెంట్‌పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీకి 'ఫేర్‌వెల్ మ్యాచ్' (వీడ్కోలు మ్యాచ్) లభించే అవకాశం ఉందని, అయితే దానికి ఒక నిబంధన వర్తిస్తుందని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నారు.

ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. జట్టు ప్లేఆఫ్స్ రేసులో ఉన్నంత కాలం ధోనీ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువని అశ్విన్ అభిప్రాయపడ్డారు. ధోనీ వస్తే జట్టు కాంబినేషన్ మారుతుందని, అది ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమని ఆయన విశ్లేషించారు. ఒకవేళ చెన్నై జట్టు తన తదుపరి మూడు మ్యాచ్‌లలో రెండింటిని ఓడిపోయి, ప్లేఆఫ్స్ రేసు నుండి తప్పుకుంటే.. అప్పుడు చెన్నైలోని హోమ్ గ్రౌండ్‌లో ధోనీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఉంటుందని అశ్విన్ చెప్పుకొచ్చారు.

కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందే ధోనీ కాలికి గాయం కావడంతో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, టీమ్ కాంబినేషన్‌కు ఇబ్బంది కలగకూడదని మరియు తన వల్ల జట్టు దృష్టి మళ్లకూడదనే ఉద్దేశంతో ధోనీ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నట్లు కోచ్ మైఖేల్ హస్సీ గతంలోనే స్పష్టం చేశారు. ఐపీఎల్ 2026లో సిఎస్‌కె ప్లేఆఫ్స్ చేరుతుందో లేదో అన్న ఉత్కంఠ మధ్య, ధోనీ మైదానంలోకి ఎప్పుడు వస్తాడా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story